తెలంగాణ

రాంకీ కొన్న భూముల రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు, గుండంపల్లి, సుంకెనపల్లిలో రాంకీ సంస్థ కొనుగోలు చేసిన భూముల రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిఎం కెసిఆర్‌ను కోరారు. రాంకీ బినామీ రిజిష్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన సిఎంకు లేఖ రాశారు. ఆ లేఖను ఆదివారం విడుదల చేశారు. బినామీ రిజిస్ట్రేషన్లు, మోసాలకు పాల్పడ్డ రాంకీ సంస్థపై ల్యాండ్ గ్రాబింగ్, 420, ఆస్తుల నష్టం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన సిఎంను కోరారు. రైతులకు ఎకరా రూ.9.50 లక్షల విలువను చెల్లించాలని, ఆనాడు చౌటుప్పల్ సబ్‌రిజిష్ట్రార్‌గా పని చేసిన రేణుక అలియాస్ ఎల్లమ్మపై కేసు పెట్టాలని, ఎలిమినేడు, గుండంపల్లి, సుంకెనపల్లి గ్రామాల భూముల సర్వేను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాంకీ సంస్థ చేస్తున్న మోసాలపై గతం నుంచే అనేక ఆరోపణలు ఉన్నా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ కాంట్రాక్ట్‌ను రాంకీ సంస్థకే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయాలి
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టయిన పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి అవసరమైన నిధులు విడుదల చేసి స్వపరిపాలన సాగించేలా చర్యలు తీసుకోవాలని తమ్మినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు నేరుగా 40 శాతం నిధులు కేటాయిస్తామని, వాటిని బడ్జెట్‌లో పొందుపరుస్తామని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటే మర్చిపోయిందని అన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి చెల్లించాల్సిన చెల్లింపులు రూ.15 వేల కోట్లకు చేరాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.