తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈనెల 22 నుంచి 26 వరకు నిర్వహించతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే ఆపివేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కమిటీ సభ్యులు పశ్యపద్మ, వీరయ్య, చంద్రశేఖర్, మార్త రాజయ్య మాట్లాడారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుకు తీసుకురాకుండానే బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారని అన్నారు. ప్రభుత్వం కేవలం సాధారణ ముసాయిదా తయారుచేసి దాన్ని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకుండానే సమావేశాలు జరుపుతామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. బహిరంగ విచారణ గురించి విస్త్రృత స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉండగా అది కూడా చేయలేదు. ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న ప్రాంత ప్రజలకు తెలిసిన భాషలో వివరాలను పొందుపరచాల్సి ఉండగా దానిని పూర్తిచేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6986 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నారని చెబుతున్న ప్రభుత్వం వారికి ఏ మేరకు నష్టపరిహారం చెల్లించారో చెప్పడం లేదు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, భయాందోళనలు కలిగించే వాతావరణంలో అభిప్రాయ సేకరణ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని అంశాలను పొందుపరిచన అనంతరమే అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు.