తెలంగాణ

పాముకాటుతో అన్నదమ్ములు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఆగస్టు 20: పాముకాటుతో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అబ్దుల్ జబ్బార్ తెలిపిన వివరాల ప్రకారం... మదనాపురం మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన బోయ ఆశన్న, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు హరికృష్ణ (10), తమ్ముడు మహేష్. వీరు నానమ్మ దగ్గర ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి నానమ్మతో కలిసి హరికృష, మహేష్ ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే వారిని మదనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, మెరుగైన వైద్యం కోసం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగానే హరికృష్ణ మృతి చెందాడు. మహేష్‌ను మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆశన్న, ఈశ్వరమ్మ దంపతుల రోదనలు మిన్నంటాయి. దీంతో ఆ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ విషయాన్ని తహశీల్దార్ సింధూజ జిల్లా కలెక్టర్‌కు వివరించగా ఆ కుటుంబానికి రూ.లక్ష 50 వేలు ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్ శే్వతామహంతి ప్రకటించారు. వెంటనే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఆర్థిక సహయం అందజేశారు. మృతుని కుటుంబానికి ఎంపిటిసి జయంతి, తిరుపతయ్య, సర్పంచు ఉమా యాదగిరి, హనుమాన్‌రావులు పరామర్శించారు.