తెలంగాణ

కూరగాయల పెంపకానికి పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల పెంపకానికి బృహత్ పథకాన్ని రూపొందించాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. రాష్ట్రంలో కూరగాయల పంటల ఉత్పత్తులు, ధరల తీరుతెన్నులపై సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షించారు. ‘మన కూరగాయల పథకం’ కింద రంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నల్లగొండ జిల్లాల్లోని 128 గ్రామాలను గుర్తించి, కాయగూరల పెంపకం చేపట్టామన్నారు. రైతులు పూర్తిగా సహకరిస్తున్నారని గుర్తుచేశారు. ఈ గ్రామాల్లో పండిస్తున్న కూరగాయలను సేకరించేందుకు 48 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి వీటిని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌తో అనుసంధానం చేశామన్నారు. కూరగాయలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తిచేసేందుకు వీలుగా రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించాలని, పాలీహౌజ్‌లను ప్రోత్సహించాలని, షడ్‌నెట్‌లను ఏర్పాటు చేయాలని, తుంపర, బిందు సేద్యాన్ని (ఎంఐపి) రైతులు చేపట్టేందుకు వీలుగా ప్రోత్సహించాలని పార్థసారథి ఆదేశించారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో కూరగాయల పథకంపై సమీక్షిస్తున్న వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి