తెలంగాణ

‘బిసి భవన్’కు పది ఎకరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బిసిల సంక్షేమం కోసం, వారి కార్యకలాపాల నిర్వహణకు హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో వంద కోట్లతో బిసి భవన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇటీవల సిఎం కెసిఆర్ బిసి కమిషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో తాము మరిన్ని డిమాండ్లను తెలియజేశామని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బిసిల కోసం బిసి భవన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఆయన ఒక విజ్ఞానపత్రాన్ని అందించారు. బిసిల జనాభా దామాషా ప్రకారం తమిళనాడు రాష్ట్ర తరహాలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి బిసి ప్లాన్ ప్రవేశపెట్టాలని, ప్రత్యేకంగా బిసి కులవృత్తుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆ వినతిప్రతంలో కోరారు. వివాదాలకు తావులేని ప్రభుత్వ భూమి 10 ఎకరాలను బిసి భవన్‌కు కేటాయించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బిసి సంక్షేమ సంఘం నాయకులు