తెలంగాణ

బాలికపై అత్యాచారం, ఆపై వీడియోలో చిత్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఉప్పల్, ఆగస్టు 21: బాలికపై అత్యాచారం చేసి, ఆపై వీడియోలో చిత్రీకరించిన ఇద్దరు యువకులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేశారు. ఉప్పల్ భరత్‌నగర్‌లో నివసిస్తున్న జనగాం జిల్లా రఘునాధ్‌పల్లి మండలం పరిధిలోని మంగల్ బండ తండాకు చెందిన గూగులోతు కుమార్ (19) డిగ్రీ విద్యార్థి. ఇతడు కుమ్మరిబస్తీలో నివసిస్తున్న బందువుల మైనర్ బాలికను బ్లాక్‌మెయిల్ చేసి ఈ నెల 16న ఇంటికి పిలిపించుకుని బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాన్ని స్నేహితుడు నవీన్‌చే వీడియో తీయించాడు. వీడియో దృశ్యాలను బాలిక తల్లిదండ్రులకు చూపించడంతో కంగారు పడ్డ ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఐపిసి సెక్షన్ 376, 354 ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న కుమార్, నవీన్‌ను అదుపులోకి తీసుకుని సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇంచార్జి ఇన్‌స్పెక్టర్ తెలిపారు.