తెలంగాణ

నేరెళ్ల ఘటనపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: సిరిసిల్ల జిల్లా, నేరెళ్ళలో దళితులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్‌సి కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే సమగ్ర నివేదిక తయారు చేసి తమకు ఫాక్స్ ద్వారా పంపించాలని కమిషన్ రాష్ట్ర డిజిపిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నేరెళ్ళలో దళితులపై అక్రమంగా కేసులు పెట్టారని, ఐదు రోజుల పాటు నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, తీవ్రంగా చిత్ర హింసలు పెట్టారని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంతియా తదితర నాయకులు ఇటీవల జాతీయ ఎస్‌సి కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుకు ఎస్‌సి కమిషన్ స్పందించి వెంటనే నివేదిక అందజేయాలని సిఎస్‌ను, డిజిపిని ఆదేశించింది. ఎస్‌సి కమిషన్ స్పందించినందుకు టి.పిసిసి నేతలు హర్షం వ్యక్తం చేశారు.
మాజీ న్యాయమూర్తి లేఖ
నేరేళ్ల ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ రాసిన లేఖను హైకోర్టు ప్రజావాజ్య పిటీషన్‌గా స్వీకరించింది. నేరెళ్లలో రైతులపై జరిగిన పోలీసు దాడిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయిల పరిహారం ఇవ్వాలని చంద్రకుమార్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కోరారు. ఇప్పటికే ఇదే అంశంపై పౌర హక్కుల కమిటీ నేత గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఇప్పటికే హైకోర్టు విచారిస్తోంది.