తెలంగాణ

గుట్కాపై గట్టి నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: హైదరాబాద్‌లో నిషేధిత గుట్కాపై టాస్క్ఫోర్స్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నగరవ్యాప్తంగా సోమవారం ముమ్మర తనిఖీలు చేపట్టి రూ.54లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రమైన బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, కిషన్‌గంజ్ ప్రాంతాల నుంచి గుట్కా ప్యాకెట్లు సరఫరా జరుగుతున్నాయని సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 54 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కాగా ఈ ప్యాకెట్లు గ్రామీణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారని, వ్యాపారులు నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్నారని పట్టుబడ్డ డ్రైవర్ తెలిపినట్టు పోలీసులు తెలిపారు. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి తెలిపారు.