తెలంగాణ

జూపల్లి కోసం వంశీ ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు కోసం కొంత సేపు ఎదురు చూశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాల్సిందిగా వంశీచంద్ మంత్రి జూపల్లికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి జూపల్లి ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బహిరంగ చర్చకు రావాల్సిందిగా తాను సవాల్ విసిరితే మంత్రి జూపల్లి చర్చకు వస్తే అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతో రాలేదన్నారు. పాలమూరు జిల్లాకు మంత్రి జూపల్లి ప్రథమ శతృవు అని ఆయన మండిపడ్డారు. తాను విసిరిన సవాల్‌ను మంత్రి స్వీకరింజచలేక ఇతరులతో మాట్లాడించారని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జివో మార్పులు చేసి, మార్పులు చేయలేదని మంత్రి అంటున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి మంత్రి ఉండడం జిల్లా ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆయన అన్నారు. డిండికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకునిపోవద్దని సిఎంకు మంత్రి లేఖ రాశారని ఆయన తెలిపారు.