తెలంగాణ

మాజీమంత్రి సమ్మయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 21: మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొచ్చు సమ్మయ్య తీవ్ర అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1982లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలుపొందారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో సభ్యునిగా కొనసాగారు. దేశప్రధానిగా పివి నరసింహారావు పనిచేసిన సమయంలో సమ్మయ్యతో ఉన్న పరిచయాలతో ఆయనను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యునిగా నియమించారు. కాకతీయ యూనివర్సిటీ సెనెట్ సభ్యునిగా, ఎన్‌ఆర్‌ఆర్ ట్రస్టు సభ్యునిగా ఆయన పనిచేసారు. మాజీమంత్రి సమ్మయ్య మరణవార్త తెలిసి మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి ఇవి శ్రీనివాసరావు తదితరులు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సమ్మయ్య మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించారు. సమ్మయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్ విచారం వ్యక్తం చేసారు. సమ్మయ్య అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌కు ఆదేశాలు జారీ చేసారు.

చిత్రం..మాజీమంత్రి బొచ్చు సమ్మయ్య మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తున్న పొన్నాల, నాయిని