తెలంగాణ

నమ్మించి..నట్టేట ముంచారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: షార్ట్ఫిల్మ్‌లలో నటిస్తే డబ్బులు బాగా వస్తాయని నమ్మించి అందమైన యువతులకు వల వేస్తూ, అశ్లీల సన్నివేశాలు చిత్రీకరిస్తూ యువతులను మోసం చేస్తున్న ముఠా వ్యవహారం సోమవారం బయటపడింది. హైదరాబాద్‌లో ఎంతోమంది యువతులు ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారు. సినిమాలో అవకాశం కల్పిస్తానంటూ ఇటీవల ఓ యువతిని ఓ మాయలేడి నమ్మించింది. మొదట్లో ఓ సినిమాలో చిన్న పాత్రకు అవకాశం కల్పించింది. మరో అవకాశం వచ్చిందని, నటిస్తే డబ్బులు బాగా వస్తాయని నమ్మించి అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. రంగ2రెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
మొయినాబాద్ మండల పరిధిలోని ఓ ఆసుపత్రిలో స్ట్ఫా నర్స్‌గా పనిచేస్తోన్న ఓ యువతికి సినిమాలో నటించాలనే కుతూహలం ఎక్కువ. అవకాశం కోసం ఎదురు చూస్తున్న సదరు యువతికి విజయలక్ష్మి అనే మాయలేడి ఆమెకు పరిచయమైంది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ నమ్మించింది. ఓ సినిమాలో చెల్లి పాత్రగా నటించేందుకు అవకాశం కల్పించింది. ఒక సన్నివేశానికి రూ. 3వేలు రావడంతో ఆ యవతికి ఆశ పెరిగింది. దీన్ని అసరాగా చేసుకున్న విజయలక్ష్మి యువతికి ఫోన్ చేసి.. ఓ షార్ట్ఫిల్మ్ ఉంది.. అందులో నటిస్తే డబ్బులు బాగా వస్తాయని నమ్మబలికింది. దీంతో సదరు యువతి ఆమె వద్దకు వెళ్లగా, దుర్గారావు అనే డైరెక్టర్‌కు అప్పగించింది. ఆ సమయంలో తెల్లపేపర్‌పై ఆమె సంతకం తీసుకుంది. అనంతరం ఆ యువతిని దూర ప్రదేశానికి తీసుకెళ్లి అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. బెదిరింపులకు గురిచేసి ఉదయం నుంచి రాత్రి వరకు పది షార్ట్ఫిల్మ్‌లు తీశారు. వాటిని ఆన్‌లైన్‌లో పెట్టారు. ఈ వ్యవహారంతో ఆసుపత్రి యాజమాన్యం అమెను ఉద్యోగం నుంచి తొలగించింది. జరిగిన అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో రంగారెడ్డి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది. అశ్లీల చిత్రాలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని, విజయలక్ష్మి, ఆమె కుమారుడు లోక్‌నాథ్, డైరెక్టర్ దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని ఈనెల 13న మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.