తెలంగాణ

విజయంపై బిజెపి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: జాతీయ స్థాయిలో ఈసారి అత్యధిక సీట్లుసాధించి స్వతంత్రంగా కేంద్రంలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి అందుకు అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాలపై, ప్రధానంగా తెలంగాణపై దృష్టిసారించింది. మిషన్ -2019లో భాగంగా దేశవ్యాప్తంగా 350 కంటే ఎక్కువ సీట్లను గెలిచే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టి రాష్ట్రంలో 119 శాసనసభ సీట్లలో కనీసం 80 సీట్లు, 17 లోక్ సభ సీట్లలో 15 సీట్లు గెలుపొందాలని పార్టీ నేతలకు నిర్దేశిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ సీటు గెలిచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి చెక్ చెప్పాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా రాష్ట్ర పార్టీ యంత్రాంగం ఆధునిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటూ ప్రజల వద్దకు వెళ్తోంది. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పార్టీ సహాయకులను నియమించింది. వారంతా బూత్ స్థాయి కమిటీలతో సమన్వయం చేస్తారు. అదే రీతిన వివిధ మోర్చాలు, విభాగాల పనితీరును పర్యవేక్షించే బాధ్యతలను ఇద్దరు సీనియర్ నేతలకు అప్పగించారు. ఎప్పటికపుడు వివిధ మోర్చాలు చేస్తున్న కార్యక్రమాలు, పనితీరును వారు సమీక్షిస్తూ నివేదికలు ఇస్తున్నారు. తెలంగాణలో ఇంటింటికీ బిజెపి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 106 పథకాలను ప్రచారంలోకి తీసుకురావడం, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం ఎలా విఫలమైందో వివరించడం అనే ద్విముఖ వ్యూహాన్ని పార్టీ నాయకత్వం అనుసరిస్తోంది. మరో పక్క జాతీయ నాయకత్వం ఇస్తున్న సూచనల మేరకు పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈనెలాఖరులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పర్యటనకు వస్తున్న అమిత్ షా మరో మారు పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. పాత బస్తీలో ప్రజాప్రతినిధులపై ఉన్న ప్రజా వ్యతిరేకతను వినియోగించుకోలని కూడా బిజెపి చూస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అనుసరించి సత్ఫలితాలను సాధించాలని చూస్తున్నారు. పాత బస్తీలో పరిపూర్ణ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు , అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బాగా ఉన్న ప్రాంతాల్లో పాగా వేసేందుకు నేతలు ప్రత్యామ్నాయ మంత్రాంగాన్ని రూపొందించారని అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు.