తెలంగాణ

ఆర్‌ఎంపిలకు ఒకే సారి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి శిక్షణ ఇచ్చి, వారిలో వృత్తి నైపుణ్యాలను మరింత పెంచాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చి సర్ట్ఫికెట్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యుల జెఎసి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మారెడ్డి వీరికి రాష్ట్రంలో ఒకేసారి శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యుల జెఎసి చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఆయా సంఘాల ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సమావేశం అయ్యారు. దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపిలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. గత కొంత కాలంగా వీరికి శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి చెప్పారు. తనిఖీల పేరుతో తమకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా వైద్యాధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని సంఘం ప్రతినిధులు మంత్రికి చెప్పారు. ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
శిక్షణకు సంబంధించిన తేదీలు, శిక్షణ కేంద్రాలు, ఏ కేంద్రంలో ఎంత మందికి, ఎన్ని రోజులు శిక్షణ ఇవ్వాలనే అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.