తెలంగాణ

అసభ్య సినిమా పోస్టర్‌ను చించేసిన విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: అసభ్య పోస్టర్‌పై ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావుకు కోసం వచ్చింది. ఇంకేముంది వెంటనే ఆ పోస్టర్‌ను చించి వేశారు. సోమవారం విహెచ్ గాంధీ భవన్ నుంచి బయటకు వెళుతుండగా, ప్రధాన రోడ్డు నుంచి ఒక బస్సు వెళ్ళింది. ఆ బస్సు వెనకాల ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ఉండడంతో వెంటనే ఆయన ఆ బస్సును ఆపించారు. కారు దిగి ఆ పోస్టర్‌ను చించేశారు. యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రకటనకు ఆర్టీసీ అంగీకరించరాదని ఆయన కోరారు.