తెలంగాణ

డిసెంబర్ కల్లా గ్రామాలకు మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: డిసెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతుందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటెక్ వెల్ నుంచి ఇంటింటికి నల్లా వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీటిని అందిస్తామన్నారు. సచివాలయంలో సోమవారం మిషన్ భగీరథ పనుల పురోగతిని వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్షించారు. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా పనుల పురోగతిపై రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఏ సెగ్మెంట్‌లో ఎన్ని గ్రామాలకు భగీరథ నీటిని అందిస్తారో వివరాలు అందించాలని సూచించారు. ఇంటెక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయో నివేదికలో పొందుపర్చాలన్నారు. పైప్ లైన్, ఎలక్ట్రో, మెకానికల్, సబ్ స్టేషన్స్, వాల్వ్, వర్టికల్ కనెక్షన్‌లకు సంబంధించి ఏజెన్సీలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పనులు జరుగుతున్నాయో లేదో నివేదికలో పొందుపర్చాలని వైస్ చైర్మన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాలకు, ఇంటింటికి మంచినీటిని త్వరలోనే అందిస్తామన్నారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో మిషన్ భగీరథ అధికారులతో సమీక్షిస్తున్న ప్రశాంత్ రెడ్డి