తెలంగాణ

మునుగోడు ఎమ్మెల్యేపై చర్య తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: నల్లగొండ జిల్లా, సర్వేల్ గురుకుల పాఠశాల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో తనకు మాట్లాడే అవకాశం లేకుండా చేసి అవమానించిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల (సర్వేల్) యజమాన్య కమిటీ చైర్ పర్సన్ చెన్నోజు ధనలక్ష్మి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు. సర్వేల్‌లోని గురుకుల పాఠశాల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభకు స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారని చైర్‌పర్సన్ ధనలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ అయిన తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా విద్యా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎంపి, ఎమ్మెల్యేల ముందు తనను అవమానించారని ఆరోపించారు. విద్యార్థి చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వెంటనే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.