తెలంగాణ

26 నుంచి అంతర్జాతీయ నృత్య ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నం కల్పశ్రీ ఆర్ట్ సెంటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు కల్పశ్రీ అంతర్జాతీయ నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో మూడు రోజుల నృత్యోత్సవాన్ని ట్రస్ట్ కార్యదర్శి, ప్రముఖ నృత్య గురువు ఎంపి సుజేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాణిరమణ, సీనియర్ జర్నలిస్ట్ రత్నాకర శర్మతో కలిసి సుజేంద్రబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, చెన్నై, ఒడిష్షా, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నృత్య కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. అంతే కాకుండా అమెరికా, లండన్, అబుధాభి, ధోహాఖత్తర్, సింగపూర్, మలేషియా దేశాల నుంచి విచ్చేసే కళాకారులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, రాజకీయ ప్రముఖులు, సాంస్కృతిక శాఖ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారని తెలిపారు.