తెలంగాణ

శ్రీరాంసాగర్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఆగస్టు 21: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని, నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 8 టిఎంసిల వరదనీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు ఎస్‌ఇ శ్రీనివాస్ తెలిపారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన నాందేడ్, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలు, గడ్డెన్న వాగు మిగులు జలాలతో పాటు చిన్నాచితక వాగుల జలాలు, మహారాష్ట్ర ప్రాజెక్టుల మిగులు జలాలు తోడు కావడంతో సోమవారం ఉదయం 40 వేల క్యూసెక్కులతో ప్రారంభమైన వరదనీరు, సాయంత్రానికి లక్షా 90 వేలకు పెరగడంతో రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆదివారం 1055.00 అడుగుల వద్ద ఉన్న రిజర్వాయర్ నీటిమట్టం, సోమవారం సాయంత్రానికి 1064.00 అడుగులు 18.01 టిఎంసిలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో రిజర్వాయర్‌కి 10 అడుగుల నీరు పెరగడంతో పాటు 10 టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఎస్‌ఇ తెలిపారు. ఎగువ ప్రాంతం నుండి మరింత వరదనీరు వచ్చే అవకాశం ఉందని, దీంతో రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరగనుందని ఎస్‌ఇ అన్నారు. ప్రస్తుతం లక్షా 16 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ఆయన తెలిపారు.
ప్రధానంగా నిజామాబాద్ పరిధిలోని నల్లవాగు నుండి అత్యధికంగా లక్షా 20 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా, గోదావరి ద్వారా 50 వేలు క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్టల్రోని గోదావరి పైన ఉన్న పలు ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో మిగులు జలాలన్నీ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గంట గంటకు గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతూ వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటలకు 39,445 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉండగా, 9 గంటల కల్లా 69 వేల క్యూసెక్కులకు చేరుకుంది. మధ్యాహ్నం 12గంటల కల్లా 1,71,874 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం 3గంటల వరకు కూడా ఇన్‌ఫ్లో పెరుగుతూనే వచ్చింది. 1,90,930 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, సాయంత్రం 4 గంటల కల్లా లక్షా 16 వేలకు తగ్గిపోయింది. అయితే మహారాష్టల్రోని పలు ప్రాజెక్టుల్లో అధికారులు మిగులు జలాలను దిగువకు విడుదల చేయగా, ఆ వరద ప్రవాహం ఎస్సారెస్పీకి చేరుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని, తద్వారా రాత్రి సమయానికి ఇన్‌ఫ్లో మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. మొత్తానికి 24 గంటల వ్యవధిలోనే 11 అడుగుల వరకు నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

చిత్రం..ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో
1064 అడుగులకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్