తెలంగాణ

వరంగల్ అభివృద్ధిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, దీని కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో వరంగల్ జంట నగరాల శాసన సభ్యుల సమావేశం బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగింది. వరంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, పెండింగ్ పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో వరంగల్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని కెటిఆర్ తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేసేందుకు తమ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం వరంగల్ నగరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని , దీని కోసం కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులను ఇచ్చిందని అన్నారు. కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా వరంగల్‌లో మార్పు తీసుకు వచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై చర్చించారు. వరంగల్ నగరంపై ప్రత్యేకంగా పురపాలక శాఖ తరఫున ఒక రోజు సమీక్ష జరపాలని మంత్రిని జిల్లా ప్రజాప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి నేతృత్వంలో వివిధ అంశాలు చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఎమ్మెల్యేలు తెలిపారు. వచ్చే వారం వరంగల్‌లో నిర్వహించే ఈ సమీక్షా సమావేశానికి పురపాలక శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగం మొత్తం పాల్గొంటుందని మంత్రి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులు, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పనులు సమీక్షిస్తారు.