తెలంగాణ

సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 21: సింగరేణి బొగ్గు పరిశ్రమలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నగరా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 6వ దఫా సింగరేణి ఎన్నికలకు తేదీ ఖరారయింది. 14 నెలల జాప్యం తరువాత గుర్తింపు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఎట్టకేలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి కెకెహెచ్‌ఎం.శ్యాంసుందర్ సమక్షంలో 15 కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. 14-9-2017 నుంచి 16-9-2017 వరకు నామినేషన్ల స్వీకరణ, 19-9-2017న నామినేషన్ల ఉపసంహరణ, 20-9-2017న నామినేషన్ల పరిశీలన, పోటీలోని సంఘాల జాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు జరుగనుంది. 5-10-2017న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిర్వహణ, 7 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13న సింగరేణి పరిశ్రమలో ఓటు హక్కును వినియోగించుకునే కార్మికుల తుది జాబితాను విడుదల చేస్తారు.
పాత ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు పరిశ్రమలో 56 వేల మంది పైచిలుకు కార్మికులు పనిచేస్తున్నారు. ‘ఒకే పరిశ్రమ - ఒకే యూనియన్’ అన్న నినాదంతో సింగరేణి బొగ్గు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా 9-9-1998న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 19-2-2001న రెండవ సారి, 14-05-2003న మూడవసారి, 9.8.2007 నాల్గవసారి, 28-6-20012 ఐదవసారి ఎన్నికలు జరుగగా 5వసారి జరిగిన ఎన్నికల సమయానికి 63,429 కార్మికులుండగా ప్రస్తుతం ఆరవసారి జరుగనున్న ఎన్నికల్లో సుమారుగా 56 వేల మంది పైచిలుకు కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లు ఉండగా ఇందులో రామగుండం రీజియన్‌లో 3, కొత్తగూడెంలో 2, భూపాలపల్లి, మణుగూర్, ఇల్లందు, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో 1 చొప్పున మొత్తంగా 36 భూగర్భ గనులు, 16 ఉపరితల బొగ్గు ప్రాజెక్ట్‌లతోపాటు సిఎస్‌పిలు, వర్క్‌షాప్‌లున్నాయి. గత ఎన్నికల్లో గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం, రాష్ట్రీయ కాలరీస్ మజ్దూర్ సంఘ్, సింగరేణి ఐక్య గని కార్మిక సంఘం, సింగరేణి కోల్ బెల్ట్ ఎంప్లారుూస్ సంఘం, సింగరేణి కాలరీస్ ఎంప్లారుూస్ యూనియన్, సింగరేణి కాలరీస్ ఫిల్లర్స్ అసోసియేషన్, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్, సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, సింగరేణి గని కార్మిక సంఘం, సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘాలు పోటీలో ఉన్నాయి.
కోడ్ సవరించకుండా
ఎన్నికల ప్రకటనపై నిరసన
కోడ్ ఆఫ్ డిసిప్లెయన్‌ను పూర్తి స్థాయిలో సవరించకుండా సింగరేణి బొగ్గు పరిశ్రమలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీని ప్రకటించడాన్ని కొన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సోమవారం హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్ ముందు సింగరేణి భవన్‌లో జరిగిన సమావేశాన్ని సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు మంద నర్సింహారావు, టి.రాజారెడ్డి బహిష్కరించి నిరసన తెలిపారు. కోడ్ ఆఫ్ డిసిప్లెయన్‌ను సవరించకుండా ఎన్నికలు చేపట్టడంతో కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్ ఆరోపించారు. 14 నెలల పాటు సింగరేణిలో ఎన్నికల జాప్యానికి టిబిజికెఎస్సే కారణమని, ఏదేమైనా ఎన్నికలకు తేదీ ఖరారు కావడం మంచి పరిణామమని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.