తెలంగాణ

గురుకుల పిడి మెయిన్స్ పరీక్ష రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: గురుకుల విద్యాలయాలలో పిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్ పరీక్షను రద్దు చేసినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. తిరిగి మరోసారి ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. జూలై 18న గురుకుల విద్యాలయాలల్లో పిడి పోస్టుల భర్తీ కోసం టిఎస్‌పిఎస్‌సి మెయిన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే నిర్వహించిన పరీక్షలో లోపాలు ఉన్నట్టు టిఎస్‌పిఎస్‌సి ఆలస్యంగా గుర్తించింది. ఒక సిరీస్ ప్రశ్నాపత్రంలో ఒక పేజీ లేకుండానే పరీక్ష నిర్వహించినట్టు తాజాగా బయటపడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరిగి నిర్వహించే పరీక్షను సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్టు పేర్కొంది.