తెలంగాణ

జిల్లాల అభివృద్ధికి రూ.23 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: జిల్లాల్లో అభివృద్ధి పనులకు ‘క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్’ (సిబిఎఫ్) కింద 23.25 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో రెండో విడతగా ఈ నిధులను విడుదల చేశారు. ఒక్కో జిల్లాకు 75 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. అత్యవసర సమయంలో ప్రభుత్వం వైపు చూడాల్సిన అవసరం లేకుండా జిల్లా కలెక్టర్లు స్వయంగా ఈ నిధులను వినియోగించే అధికారాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. అయితే సంబంధిత జిల్లా మంత్రి సూచనల మేరకే కలెక్టర్లు ఈ నిధులను వినియోగించడం పరిపాటిగా మారింది.