తెలంగాణ

1నుంచి ఆర్టీఏ కొత్త నిబంధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: వాహనాల రిజిస్ట్రేషన్లు, మలి విడత విక్రయాల్లో బదలాయింపు వంటి వాటిల్లో సమూలమైన మార్పులు తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ సమాయత్తమైంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా శాఖ సంయుక్త కమిషనర్, కార్యదర్శి జె. పాండురంగ నాయక్ మంగళవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు. ఉదాహరణకు ఒక వాహనదారుడు తన వాహనాన్ని మరో వ్యక్తికి విక్రయించి, సదరు వ్యక్తికి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఫారం నెంబర్ 29, 30పై సంతకాలు చేసేయడంతో తన పని పూర్తయిపోయిందని భావిస్తారని అయితే, ఆ వాహనాన్ని ఖరీదు చేసిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానో, మరే ఇతర కారణాలతో పేరు మార్చుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు వాహనాన్ని విక్రయించిన వ్యక్తే బాధ్యుడు అవుతున్నట్లు ఆయన వివరించారు. ఎందుకంటే ఆ వాహనం ఇంకా విక్రయించిన వ్యక్తి పేరిటే కొనసాగుతుంటుందని అన్నారు.
ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నందున, దీనికో పరిష్కార మార్గం కనుక్కున్నామని ఆయన తెలిపారు. అదేమిటంటే... వాహనాన్ని విక్రయించిన వ్యక్తి ఫారం నెం. 29, 30పై సంతకం పెట్టడంతోనే తన పని పూర్తయ్యిందనుకోకుండా, ఆ రెండు ఫారాలను స్కాన్ చేసి రవాణా శాఖ వెబ్ సైట్ ఆళ్ఘశఘశ్ఘ.ఆ్ఘశఒఔ్యఆ.్య్ప.జశలో అఫ్‌లోడ్ చేయాలని అన్నారు. దీంతో విక్రయించిన వ్యక్తికి తదుపరి బాధ్యత ఉండదని ఆయన తెలిపారు. ఆ రెండు ఫారాల్లో విక్రయించిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, వాహనం నెంబర్, ఆధార్ కార్డుల నెంబర్లూ ఉంటాయని అన్నారు. ఒకవేళ కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరిట వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా, విక్రయించిన వ్యక్తి వెబ్‌సైట్‌లో చూసి కొనుగోలుదారునిపై ఒత్తిడి తెచ్చేందుకూ అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కొనుగోలు చేసిన వ్యక్తి వెంటనే తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే, విక్రయించిన వ్యక్తి మరో వాహనాన్ని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే, రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తున్నందున రెండు శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మొదటి వాహనాన్ని విక్రయించి సంవత్సరాలు గడుస్తున్నా, ఆ వ్యక్తి పేరిట బదిలీ కాకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని ఆయన తెలిపారు. ఇవి తమ దృష్టికి బాగా వస్తున్నాయని అన్నారు. స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడమే కాకుండా, ఖరీదు చేసిన వ్యక్తి ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేంత వరకూ మొదటి యజమానే బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఫోర్జరీకి అడ్డుకట్ట వేసేందుకు ఆధారే అన్నింటికీ ఆధారం చేస్తున్నామని రవాణా శాఖ సంయుక్త కమిషనర్, కార్యదర్శి తెలిపారు.