తెలంగాణ

తీర్పు చరిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ముస్లిం సోదరీమణులు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఈ తీర్పు ఎంతో ఊరట అంటూ పోరాటం చేసిన మహిళలను అభినందించారు. ఈ తీర్పు ఎవరి విజయమో, పరాజయమో కాదని, మహిళలకు జరిగిన న్యాయమని అన్నారు. ఈ తీర్పు వల్ల ముస్లిం మహిళా లోకానికి సమాన హక్కులు, మహిళల స్వావలంబన ఇది సహకరిస్తుందని అన్నారు. వేరొక ప్రకటనలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సైతం సుప్రీంకోర్టు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అమలు అసాధ్యం: ఒవైసీ
ట్రిపుల్ తలాఖ్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు క్షేత్ర స్థాయిలో అమలు చేయడం అంత సులభం కాదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ట్రిపుల్ తలాఖ్ అనేది ఒక సామాజిక అంశమని, సంస్కరణల ద్వారానే మార్పు రావాలని అసద్ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాబట్టి చట్టాలు చేయడం, తీర్పుల వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక సంస్కరణలు జరిగి సమాజంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ఇది తమ పార్టీ అభిప్రాయమని ఆయన చెప్పారు.సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివిన తర్వాత మళ్లీ దీనిపై స్పందిస్తానని అన్నారు. సుప్రీం తీర్పును అసద్ స్వాగతిస్తూనే కొంత భిన్నంగా స్పందించడం గమనార్హం.

చిత్రం..మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత లక్ష్మణ్