తెలంగాణ

పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఎందరో కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న చలనచిత్ర రంగాన్ని పరిరక్షించేందుకు పైరసీని అరికట్టడంలో అధికారులు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ ఇండియన్ కాపీరైట్స్ సంస్థ చైర్మన్ రత్నాకర్, డైరెక్టర్ అరవింద్‌లు మంత్రిని మంగళవారం కలిశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చిత్రాలు నిర్మిస్తున్నా పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. పైరసీ నివారణకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. విజిలెన్స్ సంస్థ అడ్మిన్ ఆఫీసర్ శివ, చంద్రశేఖర్ శర్మ, బిఆర్ నాయుడు, ప్రతాప్ తదితరులు మంత్రి తలసానిని కలిసిన వారిలో ఉన్నారు.