తెలంగాణ

ఖరీఫ్ పండింది..రికార్డు స్థాయలో పత్తి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఈసారి ఖరీఫ్‌లో పంట దిగుబడి బాగుంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ, ఉత్పత్తి కమీషనర్, వ్యవసాయ కమీషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పత్తి రికార్డు స్థాయిలో సాగు అవుతున్నట్టు చెప్పారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలోనూ ఈసారి పత్తి సాగు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పది జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్టు చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా స్థాయి మార్కెటింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని ఆదేశించారు. పంటల విస్తీర్ణం, ఉత్పత్తి పెరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పని తగిన ప్రణాళికలు ముందుగానే రూపొందించాలని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా పత్తి కనీస మద్దతు ధర స్థిరీకరణకు నిర్వహిస్తున్న ప్రాజెక్టు అంచనాలు సెప్టెంబర్ నెలాఖరు కల్లా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పత్తి కొనుగోలు కోసం 150 సిసిఐ కేంద్రాలు అవసరం అని కేంద్రానికి తెలపగా, కేంద్ర ప్రభుత్వం 130 కేంద్రాలు ఇచ్చే అవకాశం ఉందని వ్యవసాయ కార్యదర్శి తెలిపారు. పత్తి రైతులకు బార్ కోడెడ్ ఐడి కార్డులు అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 2016లో పత్తి రైతులకు 25లక్షల కార్డులు అందజేసినట్టు తెలిపారు. ఆదే విధంగా 2017 ఖరీఫ్‌లో పెరిగిన పత్తి రైతుల వివరాలు నమోదు చేయాలని, దీని వల్ల దళారుల ప్రమేయం నివారించవచ్చునని చెప్పారు. ఈ సమాచారం మార్కెటింగ్ శాఖకు ఇవ్వాలని, దీని వల్ల బార్ కోడెడ్ కార్డులు అందజేయడానికి వీలవుతుందని తెలిపారు.
జిల్లాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లులు వాటి లైసెన్స్‌ల వివరాలు మార్కెటింగ్ శాఖకు ఇవ్వాలని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి కోరారు. రైతు సమగ్ర సర్వే డాటా కంప్యూటరీకరించడం పూర్తి చేయాలని వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం జగన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 31 నాటికి రైతు సమగ్ర సర్వే డాటా పొందు పరచడం పూర్తి చేయాలని కోరారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన ఐదు జిల్లాలకు సెప్టెంబర్ 5 గడువు నిర్ణయించారు. మండల స్థాయి రైతు సమావేశ వేదికలు నిర్మించడానికి ప్రతిపాదనలు సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఆదేశించారు.