తెలంగాణ

నియోజకవర్గ నిధులపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: నియోజక వర్గ అభివృద్ధి నిధులు(సిడిపి) వార్షిక ఆడిట్ నివేదికతో అఫిడవిట్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాద్ హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన బెంచ్ విచారించింది. నియోజక వర్గం అభివృద్ధి నిధుల పేరుతో ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారని, దానికి ఆడిట్ జరగలేదని పిల్ దాఖలు చేశారు. సిడిపి నిధులపై ఆడిటింగ్ జరుగుతుందా? లేదా అని ప్రశ్నించింది. గత రెండేళ్ల ఆడిటింగ్ జరిగిందని, ప్రస్తుత సంవత్సరానికి జరిగిన వ్యయంపై ఆడిటింగ్ జరుగుతోందని అడ్వకేట్ జనరల్ కోర్టు డి ప్రకాశ్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసును మూడు వారాలకు వాయిదా వేశారు.