తెలంగాణ

విత్తన ధరలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: యాసంగి పంటల విత్తన సరఫరాకై రాష్ట్ర వ్యవసాయ శాఖ ధరలను ఖరారు చేసింది. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం అధికారులతో సమావేశం అయ్యారు. రాబోయే యాసంగిలో మొత్తం 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందులో శనగ , వేరుశనగ తప్ప మిగతా పంల విత్తనాల ధరల్లో మార్పు లేదు. శనగకు సంబంధించి మొత్తం 1.33 లక్షల క్వింటాళ్లను సరఫరా చేస్తారు. క్వింటాలు ధర 8680 రూపాయలు. దీనిలో 33శాతం సబ్సిడీ 2865 కాగా, మిగతా మొత్తం 5815 రూపాయలు రైతు చెల్లించాలి. వేరుశనగకు సంబంధించి మొత్తం 1.64 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. క్వింటాలు ధర 7600. దీనిలో 40శాతం సబ్సిడీ 3040 రూపాయలు మిగతా మొత్తం 5460 రూపాయలు రైతు చెల్లించాలి.