తెలంగాణ

నక్సల్స్ జిల్లాల్లో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉన్న జిల్లాల్లో రూ.1300 కోట్ల నిధులతో 215 రోడ్ల అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి. కాని ఈ రోడ్ల అభివృద్ధికి దాదాపు వెయ్యి ఎకరాల అటవీ భూములను సేకరించాల్సి ఉంది. దీనికి అటవీ శాఖ అనుమతులు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే రాష్ట్ర అడవుల మంత్రిత్వశాఖ చూపిన చొరవ వల్ల చాలా వరకు రోడ్ల అభివృద్ధికి అవసరమైన భూములను సేకరించే ప్రక్రియ మొదలైంది. అభివృద్ధి చేయాల్సిన రోడ్ల పొడువు 1200కి.మీ వరకు ఉంది. మొత్తం రూ.1300 కోట్ల నిధుల్లో 60శాతం వరకు కేంద్రం భరిస్తుంది. పాత జిల్లాల్లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌లను నక్సల్ ప్రభావిత జిల్లాలుగా కేంద్రం గుర్తించింది. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణం కొనసాగుతుంది. మొత్తం 1200 కి.మీ రోడ్డులో 570 కి.మీ రోడ్లను రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తుంది. మిగిలిన రోడ్ల అభివృద్ధి పనులను పంచాయితీరాజ్ శాఖ , గిరిజన సంక్షేమ శాఖలు చేపడుతాయి.