తెలంగాణ

సంస్కారహీనులతో చర్చించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22:ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, అలాంటి సంస్కారహీనులతో చర్చించే ప్రసక్తే లేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, కాంగ్రెస్ సభ్యులు ప్రాజెక్టులపై ఏం మాట్లాడదల్చుకున్నారో సభలో మాట్లాడవచ్చునని, ప్రశ్నించవచ్చునని సూచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు రావడం ఖాయమని, దీంతో కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు తలుచుకుని భయపడుతున్నారని అన్నారు. కల్వకుర్తికి సాగునీరు వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావుపై వంశీచంద్‌రెడ్డి నోరుపారేసుకోవడం మానుకోవాలని, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని అన్నారు. ప్రాజెక్టులపై శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక రోజంతా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సభలో ఉండకుండా బయటకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు, డిండి ద్వారా నల్లగొండ జిల్లాలో రెండు లక్షల 40వేల ఎకరాలకు, కల్వకుర్తి నియోజకవర్గానికి కెఎల్‌ఐ ద్వారా 71వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులు పూర్తిచేసి మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు ఇచ్చి తీరుతుందని వెంకటేశ్వరెడ్డి స్పష్టం చేశారు.