తెలంగాణ

భద్రత, స్వచ్ఛతకు రైల్వే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆరు రైల్వే డివిజన్లకు చెందిన అధికారులతో జిఎం వినోద్‌కుమార్ మంగళవారం సికిందరాబాద్‌లోని రైల్వే నిలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్వే భద్రత, స్వచ్ఛ రైల్వే, స్వచ్ఛ భారత్‌పై సమావేశం జరిగింది. రైల్వే అధికారులు ఆరు డివిజన్ల పరిధిలోని ఆయా రైల్వే స్టేషన్లలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌పై చర్చ జరిగింది. సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్ల పరిధిలో రైల్వే ఉద్యోగులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలచే స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈనెల 16 నుంచి 21వరకు జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో 239 అధికారులు, 5335 మంది సిబ్బంది పాల్గొన్నారని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు.