తెలంగాణ

ఒక్కో గ్రామంలో 40వేల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: హరిత హారం పథకాన్ని రొటీన్‌గా చూడవద్దని తెలంగాణలో భవిష్యత్తు ప్రజాజీవితంతో ముడిపడి ఉన్న పథకంగా ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్లు, ఇతర అధికారులు పథకం అమలుపై దృష్టిసారించాలని అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ సూచించారు. కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరిత హారం అమలు ఆధారంగా అధికారుల పనితీరు మదింపు ఉంటుందని, జిల్లాలకు ర్యాంకులు ఉంటాయని చెప్పారు. వర్షాల వల్ల అంతరాయం ఏర్పడినా, ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలను హరిత హారంకు ఉపయోగించుకోవాలని చెప్పారు. ఒక్కో గ్రామంలో కనీసం 40వేల మొక్కలు నాటాలని సూచించారు. జిహెచ్‌ఎంసితో పాటు నగరాలు, పట్టణాల్లో అర్బన్ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లాలో హరిత హారంను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, అంత సంతృప్తికరంగా లేరని అన్నారు.