తెలంగాణ

వృత్తి విద్యాకోర్సులకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం నాడు బోర్డు కార్యాలయంలో జరిగిన రెండో సర్వ సభ్య సమావేశంలో కడియం పాల్గొన్నారు. ఇంత వరకూ దేశంలో బెస్టు డిజిటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ బోర్డుకు అవార్డు లభించిందని అన్నారు. ఇందుకు కృషి చేసిన బోర్డు అధికారులను ఆయన అభినందించారు. ఇక మీదట ప్రతి ఆరు నెలలకోమారు ఇంటర్ బోర్డు సభ్య సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
అదే విధంగా బోర్డు సభ్యులను సైతం అవసరాలకు అనుగుణంగా మారుస్తామని తెలిపారు. వృత్తివిద్యా కోర్సులను మరింత పటిష్టం చేసి, కోర్సు పూర్తి చేసిన వారికి జాబ్ వచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేస్తామని అన్నారు. ఇందుకోసం, జెఎన్‌టియు, వైద్య ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ వారితో మాట్లాడి డిజైన్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక కమిటీని వేస్తామని రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బోర్డు పరిధిలో 404ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయని, వాటన్నింటిలో ఉన్న వసతులు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలతో కూడిన ప్రొఫైళ్లు తయారుచేస్తామని అన్నారు.
ఏ ఏ కాలేజీల్లో ఏ కోర్సులు ఉన్నాయో, ఎలాంటి వసతులు ఉన్నాయో ఈ ప్రొఫైల్స్ వల్ల తెలుస్తుందని పేర్కొన్నారు. గతంలో ప్రైవేటు కాలేజీలు బోర్డును అజమాయిషీ చేసేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు కాలేజీలపై బోర్డు పట్టు సాధించిందని అన్నారు. ఇంటర్ విద్యలో ఉచిత విద్య అమలుచేస్తున్నామని, 325 కోట్లు ఖర్చు చేసి 404 కాలేజీల్లో ల్యాబ్స్, లైబ్రరీలు, వౌలిక వసతులు కల్పించామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అన్నింటికీ పక్కా భవనాలు సమకూరుస్తున్నామని, ప్రతి కాలేజీలో సిసి కెమరాలు, బయోమెట్రిక్ మిషన్లు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డులో 22సర్వీసులను ఆన్‌లైన్ చేశామని చెప్పారు. త్వరలోనే మరిన్ని సైవలను ఆన్‌లైన్ చేస్తామని చెప్పారు.