తెలంగాణ

నవభారత నిర్మాణమే మోదీ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయినా ఇంకా స్వాతంత్య్ర ఫలాలు పూర్తిగా అందడం లేదని, ఆ లక్ష్యం పూర్తికాలేదని, దానిని పూర్తి చేసేందుకే నూతన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రధాని నరేంద్రమోదీ పూనుకున్నారని బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పేర్కొన్నారు. ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగిన సంకల్పసిద్ధి సభలో ఆయన పాల్గొన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలుచుకోవాలని , పేదల జీవితాలు మెరుగైనపుడే నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఎన్నికలు, గెలుపు ఓటములు సహజమైన విషయమని, సంక్షేమం, అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మోదీ అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే 2019ఎన్నికల్లో ప్రజలు బిజెపికి పట్టం కడతారని ఆయన పేర్కొన్నారు. అత్యధిక స్థానాలను గెలవడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. తెలంగాణలో 2019లో పూర్తి శక్తిని కేంద్రీకరించి పనిచేస్తామని అన్నారు. రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంతో స్నేహంగా ఉండటం మంచి సంప్రదాయమని, దాని అర్ధం రాజకీయాలు ఉండవని మాత్రం కాదని అన్నారు. హైదరాబాద్‌లో మజ్లిస్‌ను మచ్చిక చేసుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారని అన్నారు. మజ్లిస్ నాయకులు అసెంబ్లీ లోపల, బయటా ఉగ్రవాదులను తలపించేలా ప్రసంగిస్తున్నారని, దేశంలో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో 18 అత్యంత వెనుకబడిన జిల్లాలేనని, రాష్ట్రప్రభుత్వం బాధ్యతా యుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని అమిత్‌షా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
2022 నాటికి నవీన భారత్‌ను నిర్మించేందుకు దేశవ్యాప్తంగా చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికలుంటే రాహుల్ గాంధీ నార్వే వెళ్లారని, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశాన్ని కులాతీత, వ్యాధుల రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామంటూ ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆయన సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె లక్ష్మణ్ , జి కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంకల్పసిద్ధి సభలో ప్రసంగిస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్