తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రంలో 15 ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. తెలంగాణ, మహారాష్టల్రో ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ జరుగుతోంది. తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాగా, మహారాష్టల్రో వచ్చేనెల జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల మద్దతు పలికారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రం వదిలిపెట్టి న్యాయస్థానాలు, గ్రీన్ ట్రిబ్యునల్స్ చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పటికైనా అది మానుకోవాలని అన్నారు. నల్లగొండ, సంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి, మేడ్చల్, నిజామాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో స్వేచ్ఛగా పబ్లిక్ హియరింగ్ జరిగినట్టు హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావిత 15 జిల్లాల్లోనూ ప్రజలు విస్తృతంగా ప్రాజెక్టుకు అనుకూలంగా తమ అభిప్రాయాలు వెల్లడించారని చెప్పారు.