తెలంగాణ

ప్రాజెక్టుల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే నీటి పారుదల ప్రాజెక్టులపై తనతో బహిరంగ చర్చకు రావాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు సిఎం కెసిఆర్ వస్తారో, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు వస్తారో లేక ఎవరు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని పొన్నాల స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో నిరంకుశ, అటవిక, గడిల పాలన సాగుతున్నదని ఆయన దుయ్యబట్టారు. 2015 సంవత్సరం నవంబర్ వరకూ ప్రాణహితకు జాతీయ హోదా అడిగిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ తర్వాత డిజైన్ మార్పు ఎందుకు చేస్తున్నారని, ప్రజలను ముంచి ప్రాజెక్టులు కడతారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల గురించి తాము మాట్లాడితే అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిర్బంధంతో ప్రాజెక్టులు కట్టాలనుకుంటే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుని ప్రాజెక్టులు చేపట్టామని పొన్నాల గుర్తు చేశారు.