తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజాభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ఎంపీ రేణుకా చౌదరి విమర్శించారు. ఆమె నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి)ని సందర్శించింది. కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, ఎం. కోదండరెడ్డి ప్రభృతులు కూడా ఆమె వెంట ఉన్నారు. ఐఐసిటిలో బిజీ-బిజీగా గడిపిన రేణుకా చౌదరి అక్కడ జరుగుతున్న పరిశోధనలపై డైరెక్టర్‌తో పాటు ఇతర శాస్తవ్రేత్తలతో చర్చించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఫార్మా కంపెనీల బాధితుల నుంచి ఆమె వినతి పత్రాలు స్వీకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు క్యామ మల్లేష్, నర్సింహారెడ్డి, అనే్వష్ రెడ్డి తదితరులు ఆమెను కలిసి ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం గురించి వినతి పత్రం అందజేశారు. అనంతరం రేణుకా చౌదరి, మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి ప్రాజెక్టులకైనా భూసేకరణ చేయడానికి ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలని, మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ సక్రమంగా జరగలేదని అన్నారు.