తెలంగాణ

నారాయణ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: అయ్యప్ప సొసైటీలోని నారాయణ విద్యా సంస్థ వర్మ-1 క్యాంపస్‌లో లాంగ్‌టెర్మ్ బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్న వై అరుణ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యాజమాన్యం ఈ సమాచారాన్ని గుట్టుగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గద్వాల్ జిల్లా దారూర్ మండలం చంద్రనాయక్ తండాకు చెందిన అరుణ తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది. ఆమె తన రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండగా తోటి విద్యార్థులు చూసి వెంటనే మాక్స్ కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని పేర్కొనడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
విద్యార్థి అనుమానాస్పద మృతి
కాగా మరో ఘటనలో నాదర్‌గుల్ డిపిఎస్ స్కూల్‌లో జి ఆదర్శ్ అనే విద్యార్ధి అనుమానాస్పదంగా మరణించినట్టు తెలిసింది. మృతదేహాన్ని పాఠశాల యాజమాన్యం ఒక బైక్‌పై ఎల్‌బి నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరలించడంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు వసూలుచేస్తున్న యాజమాన్యాలు కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుకోలేదని, దాంతో ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తరలించారని, సరైన వైద్యం సకాలంలో అంది ఉంటే విద్యార్ధి బ్రతికే వాడని వారు చెబుతున్నారు.