తెలంగాణ

31నుండి డీసెట్ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రెండేళ్ల డిఇడి కోర్సులో చేరేందుకు ఈ నెల 31 నుండి డీసెట్ అడ్మిషన్లను నిర్వహించనున్నారు. వెబ్ ఆధారితంగా జరిగే అడ్మిషన్లకు సెప్టెంబర్ 6 వరకూ ఆప్షన్ల నమోదు గడువు ఇచ్చారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 12న జరుగుతుంది. సెప్టెంబర్ 14 వరకూ ఫీజు చెల్లించాలి, సంబంధిత కాలేజీల్లో సెప్టెంబర్ 12 నుండి 15వ తేదీలోగా అభ్యర్ధులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
దూరవిద్య నాణ్యంగా ఉండాలి
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో విద్యార్థి నిలదొక్కుకునేలా మరింత నాణ్యమైన విద్యావిధానాన్ని అందించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా దేశంలోని సార్వత్రిక విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయని ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లెర్నర్ సెంట్రిక్ లెర్నింగ్ సిస్టమ్ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. దూరవిద్యా విధానంలో విద్యార్థి సేవలు, నాణ్యమైన మెటీరియల్ విద్యార్థులకు చాలా ఉపయుక్తమని అన్నారు. కార్యక్రమానికి విసి ప్రొఫెసర్ కె సీతారామారావు అధ్యక్షత వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి వెంకటయ్య, అకడమిక్ ఇంచార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ కె సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.