తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మాలని నిర్ణయించామని గృహనిర్మాణ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన రాజీవ్ స్వగృహ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్కువ ధరలకే ఫ్లాట్లను విక్రయిస్తున్నామన్నారు. వౌలిక వసతులను రాజీవ్‌స్వగృహ ప్రాంతాల్లో ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. ఇల్లు కావాలనుకునే వారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని కోరారు. ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్‌లో (మొదట దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత) ఇళ్లను కేటాయిస్తామన్నారు. బండ్లగూడ, పోచారంలలో 3710 ఫ్లాను నిర్మించామన్నారు. బండ్లగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లను చదరపు అడుగుకు 1900 రూపాయలు, సెమీ ఫినిష్‌డ్ ఫ్లాట్లను చదరపు అడుగుకు 1700 రూపాయలకు విక్రయిస్తున్నట్టు వివరించారు. అలాగే పోచారంలో నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లను చదరపు అడుగుకు 1700 రూపాయలు, సెమీ ఫినిష్‌డ్ ఇళ్లకు చదరపు అడుగుకు 1500 రూపాయలుగా ధర నిర్ణయించామన్నారు.
గొప్ప విషయం : సిఎస్
కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేర్కొన్నారు.
ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న స్నేహ, ప్రేమపూర్వక కానుకగా ఆయన అభివర్ణించారు. గృహనిర్మాణ శాఖ నిర్మించిన ఈ ఇళ్ల వల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు చెలరేగవని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఇళ్లను విక్రయించేందుకు చర్యలు తీసుకున్న గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు రాజీవ్ స్వగృహ అధికారులను సిఎస్ ఈ సందర్భంగా అభినందించారు. చాలాకాలం క్రితమే పూర్తయిన ఈ ఫ్లాట్లను అమ్మకపోవడం వల్ల గృహనిర్మాణ శాఖపై పెనుభారం పడిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటాగా వడ్డీతో కలిపి 1069 కోట్ల రూపాలు రాజీవ్ స్వగృహపై భారం పడ్డదన్నారు. కెసిఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇప్పటికే 670 కోట్ల రూపాయల రుణాన్ని తీర్చారని, మిగతా రుణాన్ని కూడా త్వరలోనే తీర్చేందుకు ఏర్పాట్లు జరిగాయని వివరించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు ఉద్యోగులకు వరం లాంటిదని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తెలిపారు. కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని టిఎన్‌జిఓ అధ్యక్షుడు కారెం రవీందర్ పేర్కొన్నారు.