తెలంగాణ

కబేళాలకు తరలిస్తున్న 60 పశువులు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, ఆగస్టు 26: నోరులేని మూగజీవాలను ఊపిరాడని లారీలో కుక్కి, వాటిని కబేళా లకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పోలీస్ చెక్ పోస్టు వద్ద శనివారం జరిగింది. పట్టుబడిన 60 పశువుల్లో మూడు మృతి చెందగా మరికొన్ని పశువులు కొనఊపిరితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు కబేళాలకు తరలిస్తున్న పశువుల లారీని మద్నూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద శనివారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ. కాశీనాథ్ తెలిపారు. ఆయన కథనం ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుండి ఎంహెచ్ 09 హెడ్‌జి 7656 నంబర్‌గల లారీలో 60 పశువులను కిక్కిరిసి నింపి ఎవరికీ అనుమానం రాకుండా లారీని తాట్‌పత్రితో క ప్పారు. బక్రీద్, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి లారీని తనిఖీ చేయగా, డ్రైవర్ లారీ దిగి పారిపోయే ప్రయత్నం చేయ గా, లారీని, డ్రైవర్‌ను పట్టుకున్నారు. లారీలో 60 పశువుల్లో ఆవులు, దూడలు, ఎడ్లు, ఇలా అనేక రకల పశువులు ఉన్నాయని తెలిపారు. ఇందులో అప్పటికే ఊపిరాడక మూడు పశువు లు లారీలో చనిపోయి ఉండగా, మిగతా కొన్ని పశువులు తీవ్ర అనారోగ్యంతో లేవని స్థితిలో ఉండడంతో వెంటనే పోలీసులు స్థానిక పశువైద్యాధికారులను పిలిపించి వాటికి ప్రథమ చికిత్సలు నిర్వహిస్తున్నారు.
విషయం తెలిసి పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులు, గ్రామస్థులు మార్కెట్ కమిటీకి తరలి వచ్చారు. మధ్యప్రదేశ్ నుండి వందలాది కిలోమీటర్ల దూరం నుండి 60 పశువులను లారీలో కుక్కి తరలించే దుస్థి తి చూసి వారికి కంటనీరు పెట్టించింది.