తెలంగాణ

హామీగానే ‘పంచాయతీ’లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 27: అధికారంలోకి వస్తే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామంటూ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు కూడా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ నూతన రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా...ఆ దిశగా అడుగులు పడడంలేదు. రాష్ట్రంలో తెరాస పగ్గాలు చేపట్టిన అప్పటినుంచి గిరిజన తండావాసులు నిరీక్షిస్తున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన తొలుతలో సిఎం కెసిఆర్ తండాలను పంచాయతీలుగా మార్చుతామని ప్రకటన చేయడంతో వెంటనే ఉమ్మడి జిల్లాలోని తండాల వివరాలను సేకరించిన అప్పటి జిల్లా అధికారులు ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడే అందజేశారు. అధికారులు సేకరించిన సమాచారం మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 32 మండలాల్లో 303 తండాలను గుర్తించారు. వీటి వివరాలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. అయినా, పంచాయతీలుగా మారడంలో జాప్యం జరుగుతూ వస్తోంది. మొదటి నుంచి గిరిజనుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిన టిఆర్‌ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తొలుత కసరత్తు మొదలు పెట్టిన ఆ తరువాత ఆ చర్యలకు కదలిక లేకుండా పోయింది.