తెలంగాణ

ఇదేనా!విశ్వనగరం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: కొద్దిపాటి చినుకులు పడితే చాలు.. రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. వా న దంచి కొడితే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. గతంలో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగేవి. ఇప్పుడు అపార్టుమెంట్ల సెల్లార్లూ నీట మునుగుతున్నాయి, లోపల ఉండే వాహనాలు తేలియాడుతున్నాయి. ఇది ఏ ఒక్క రోజో లేక ఒక ఏడాదో కాదు, సంవత్సరాల తరబడి కొనసాగుతున్నది. సుమారు పదేళ్ళ తర్వాత శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమైంది. 113.7 మి.మీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండి) ప్రకటించింది. 2009 సంవత్సరం ఆగస్టు 18న 133.7 మిమీ, 2008 ఆగస్టు 9న 121.9 మిమీ వర్షం కురిసింది. అప్పుడు ప్రజలు పడిన కష్టా లు వర్ణనాతీతం. అప్పుడే కాదు, ఇప్పుడూ పడుతున్నారు. చివరకు వర్షాకాలం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వస్తోంది. గట్టిగా ఒక్క వాన పడితే, ఆ తర్వాత రోడ్లన్నీ గుంతలే. తాము అధికారంలోకి వస్తే, రోడ్లపై నీరు నిలవదని, గుంతలు మటుమాయమై పోతాయని హామీ ఇచ్చినా, రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి ఏ మాత్రం మారలేదు. పైగా వర్షం కురిస్తే చాలు, రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలుచుండి పోతున్నది. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు చలాన్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇంకా రెండు అడుగులు ముందుకేసి హెల్మెట్ లేదనో, కారులో సీటు బెల్టు పెట్టుకోలేదనో ఫొటోలు తీయడంలో నిమగ్నమవుతున్నారు.
ఇలాఉండగా ఆదివారం మరోసారి వాన దంచి కొట్టింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలతోనే కొన్ని అపార్టుమెంట్లలో ఇంకా నీరు ఉండగా, ఆదివా రం కురిసిన వర్షంతో మరింత ప్రమాదకంగా మారిం ది. మదీనాగుడాలోని పలు అపార్డుమెంట్ల సెల్లార్లు వర్షంతో నిండిపోయాయి. దీంతో సత్యనారాయణ ఎన్‌క్లేవ్ బేస్ కొట్టుకుపోయింది. జిహెచ్‌ఎంసి అధికారులు అక్కడికి చేరుకుని 80 కుటుంబాలను అక్కడి నుంచి తరలించారు. ఈ పరిస్థితులు మారేదెప్పుడోనని ప్రజలు ఆందోళనగా ఉన్నారు. రాబోయే 48 గంటలూ భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ పరిశోధనా కేంద్రం ప్రకటించడంతో ప్రజలు మరింత ఆం దోళనన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ తదితర అధికారులు బేగంపేటలోని వాతావరణ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి, వర్ష సూచనల గురించి తెలుసుకున్నారు.
గుంతలతో బేజారు..
మరోవైపు ప్రజలు గుంతలతో బేజారెత్తుతున్నా రు. వర్షం నీరు నిలిచి ఉండడంతో, ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ లేదో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్న వాహనాలు కొద్దిగా లోతుగా ఉన్న గుంతల్లో దిగడంతో వారు కింద పడుతున్నారు. జంట నగరాల్లో 18,568 గుంతలు ఉన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులే గుర్తించడం గమనార్హం. కింగ్ కోఠి, ఛాదర్‌ఘాట్, దోమల్‌గుడా, బేగంపేట, సైదాబాద్, చార్మినార్, ధూల్‌పేట, ట్యాంక్ బండ్, బషీర్‌బాగ్, పాతనగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మాదాపూర్, హైటెక్ సిటీ వైపు ఉన్న రోడ్లూ బాగా దెబ్బతిన్నాయి. జిహెచ్‌ఎంసి అధికారులు అక్కడక్కడా గుంతలు పూడుస్తున్నా, చిన్న వర్షానికే కొట్టుకుని పోయి, రాళ్ళు పైకి వస్తున్నాయి.

చిత్రాలు.. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షంతో నగరంలో వాహనాదారుల ఇక్కట్లు