తెలంగాణ

గోదావరిఖనిలో విలేఖరి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 27: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో అరుకోళ్ల శ్రీనివాస్ అలియాస్ బుగ్గల శ్రీను అనే విలేఖరి దారుణ హత్యకు గురయ్యా డు. స్థానిక ఉదయ్ నగర్‌లోని తన ఇంట్లో విచక్షణారహితంగా దుండగులు కత్తులతో దాడి చేసి అతనిని హతమార్చారు. అడొచ్చిన శ్రీను భార్య అంజలిపైన కూడా దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆమె కూడా గాయపడింది. ఆదివారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం రేపింది. మృతుడు ప్రస్తుతం మన తెలంగాణ తెలుగు దిన పత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు.
పోలీస్ కానిస్టేబుల్ ఎర్రగోళ్ల రమేష్ హత్య కేసుతోపాటు సర్పంచ్ చింతల ప్రశాంత్, పుట్ట శారద హత్య కేసుల్లో కూడా నిందితునిగా శ్రీనివాస్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 2010లో శ్రీనుపై గోదావరిఖని వన్‌టౌన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. సంఘటనకు సంబంధించిన మృతుని భార్య అంజలి, పోలీసుల కథనం ప్రకారం... స్థానిక ఉదయ్ నగర్‌లోని టి2 265లో శ్రీనివాస్ కొంతకాలంగా నివాసముంటున్నాడు. ఆదివారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో రవిశంకర్ అనే వ్యక్తి వచ్చి అన్న ఉన్నాడా అని అడగగా ఉన్నాడని చెప్పడంతో అతనితో వచ్చిన మరికొంతమంది వెనక్కి చేతులు పెట్టుకొని లోనికి వెళ్లారు. వాళ్ల చేతుల్లో కత్తులు చూసిన తాను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తనపై కత్తులతో దాడి చేశారు. గదిలో ఉన్న శ్రీనుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి చంపారు. బాధితురాలు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చే ప్రయత్నం జరిగేలోపే దుండగులు శ్రీనును హతమార్చి ఆటోలో అక్కడ్నుంచి పారిపోయారు. ఈ హత్యకు భూ వివాదాల సెటిల్‌మెంటే కారణమైనట్లుగా భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్, పెద్దపల్లి డిసిపి విజేందర్ రెడ్డి, ఎసిపి అపూర్వ రావు, సిఐలు గజ్జి క్రిష్ణ, వాసుదేవరావు, ఎస్‌ఐలు పరిశీలించారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందంతో గాలింపులు చేస్తున్నామని, దుండగులను పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ దుగ్గల్ విలేఖరులకు తెలిపారు.