తెలంగాణ

కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభు త్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు చేపడుతోందని, గత మూడేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏమి సాధించిందో వివరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో లోపాయికారి ఒప్పందంతో ముందు కు సాగుతూ పాలన సాగిస్తున్నాయని, నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆయ న అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలోని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వామన్‌గారి కృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిజెపితో లోపాయికారి ఒప్పందం లేకపోతే రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఎ బలపరచిన అభ్యర్థికి ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసుకున్న చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నా రు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు ఏమయ్యాయని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేవలం కొన్ని ప్రాంతాలకేనా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ కేవలం వడ్డీకే సరిపోయిందని, అసలు అప్పు అలాగే మిగిలిపోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ బాధ్యతారాహిత్యమైన పాల న కొనసాగిస్తున్న కెసిఆర్‌కు భంగపాటు తప్పదన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సంప్రదించకపోయినా అధికార పార్టీలోని ఎమ్మెల్యేలను సైతం కెసిఆర్ లెక్క చేయకుండా పాలన సాగిస్తున్నారని, కెసిఆర్ అంటే మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు భయపడుతూనే తమ పదవుల్లో కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలంతా టిఆర్‌ఎస్ పాలనతో విసుగు చెంది ఉన్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్, దిలీప్‌కుమార్ వైకుంఠ్, నారాయణ ఉన్నారు.

చిత్రం..నారాయణపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి