తెలంగాణ

‘డేరా’ భూములు స్వాధీనం చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, ఆగస్టు 27: ఆశ్రమం కోసం భూములను కొనుగోలు చేసిన డేరా సచ్చా సౌదా సంస్థకు సంబంధించిన భూముల్లో అసైన్డ్ భూములు కూడా కొనుగోలు చేశారని, వాటిని చట్ట ప్రకారం వెనక్కి తీసుకుంటామని నల్లగొండ ఆర్‌డివో ఇ. వెంకటాచారి తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు శివారులో జాతీయ రహదారి పక్కన గల డేరా సచ్చా సౌదా సంస్థకు సంబంధించిన ఆశ్రమ భూములను ఆదివారం ఆర్‌డివో వెంకటాచారి, తహశీల్దార్ విశాలాక్షి, సిఐ పాండురంగారెడ్డి, ఆర్‌ఐ పృథ్వీతో కలిసి పరిశీలించారు. మొదటగా వెలిమినేడులో ఆశ్రమ భూములకు సంబంధించిన మ్యాప్‌ను ఆర్‌డివో పరిశీలించారు. వెలిమినేడులో ఆశ్రమాన్ని సందర్శించి భూములను పరిశీలించి వాటికి సంబంధించిన పత్రాలను స్థానిక ఆశ్రమ నిర్వాహకుడు శ్యామ్‌లాల్ ఆర్‌డివోకు చూపించారు. ఎప్పుడెప్పుడు భూములు కొనుగోలు చేశారని శ్యామ్‌లాల్‌ను ఆర్‌డివో అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమం భూముల్లో అసైన్డ్ భూమి కూడా ఉన్నదని ఆర్‌డివో శ్యామ్‌లాల్‌తో చెప్పగా తాము 2007 నుండి 2015 వరకు భూములను కొనుగోలు చేశామని, తాము కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు కొనుగోలు చేశాక తెలిసిందని, కొనుగోళ్ళలో తప్పు జరిగిందని, అసైన్డ్ భూములను తమకు క్రమబద్ధీకరించాలని తహశీల్దార్, సంయుక్త కలెక్టర్, కలెక్టర్‌లకు దరఖాస్తు చేసుకున్నామని శ్యామ్‌లాల్ ఆర్‌డివోకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌డివో మాట్లాడుతూ డేరా సచ్చా సౌదా సంస్థకు సంబంధించిన ఆశ్రమం నిర్వాహకులు 55 ఎకరాల 10 గుంటల భూములు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారని వాటిలో 9 ఎకరాల 29 గుంటల అసైన్డ్ భూమి ఉన్నట్లుగా నిర్ధార ణ జరిగిందని, ఆ భూమిని నిబంధనల మేరకు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆశ్రమం నిర్వాహకులు భూముల కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా భూములు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోళ్ళు జరగలేదని, కేవలం లోపాయకారి ఒప్పందం ద్వారా తెల్లకాగితంపై అసైన్డ్ భూములు విక్రయించిన వారు భూములను విక్రయించినట్లు రాసి ఇచ్చి డబ్బులు తీసుకున్నారని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారన్నారు. అసైన్డ్‌దారు లు ఆశ్రమ నిర్వాహకులకు విక్రయించిన భూము లు సరైనవేనని చెప్పడంతో కొనుగోలు చేసినట్లు తెలియజేశారన్నారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయరాదని ఆ భూములను కొనుగోలు చేసి న వారికి, అసైన్డ్ దారుడు భూములను విక్రయించినట్లు రుజువులు ఉన్నాయని, ఇద్దరు క్రయవిక్రయ దారులకు అసైన్డ్ భూముల నిమమావళిని ఉల్లంఘించారన్నారు. అసైన్డ్ భూములను ఎవరైనా కొనుగోలు చేసినా వాటిని స్వాధీనం చేసుకుంటామని, విక్రయించిన వారికి కొనుగోలు చేసిన వారికి ఇద్దరు విక్రయదారులకు అసైన్డ్ నియమావళి ప్రకారం నోటీసులు జారీ చేస్తామని, అసైన్డ్‌దారుల నుండి వివరణలు తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్రం..చిట్యాల తహశీల్ కార్యాలయంలో వెలిమినేడు భూముల మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో వెంకటాచారి