తెలంగాణ

తెలంగాణ అంటేనే కళలు, పాటలు, సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 27: తెలంగాణ అంటేనే పాటలు...సంస్కృతి...సంప్రదాయాలని, నాటి సాయుధ పోరాటం నుంచిమొదలుకొని మొన్నటి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఈ ప్రాంతం లో పాటలు, కళాకారులే స్ఫూర్తినిచ్చారని విద్యుత్ శాఖ మంత్రి అన్నారు. భాష సంస్కృతికశాఖ, సాంస్కృతిక సారథి, తెలంగాణ జానపద కళాకారుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జిల్లాకేంద్రంలో జిల్లా స్థాయి జానపద జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద నుండి కళాకారుల ప్రదర్శనను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పాటతోనే ఉద్యమాలు పురుడు పోసుకున్నాయని, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరా టం, సమైక్యవాదులతో నిర్వహించిన స్వరాష్ట్ర ఉద్యమంలో పాటలే ప్రజలలో చైతన్యం రగిలించి బానిస పాలన నుంచి విముక్తి కల్పించాయని గుర్తు చేశారు. పాటలతో సూర్యాపేట జిల్లా కు ఘన చరిత్ర ఉందని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బండెనక బండి కట్టి...పదహారు బండ్లు కట్టి అన్న పాట సూర్యాపేట జిల్లా నుంచే పుట్టిందని ఆయన గుర్తు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలతో పాటు కళాకారులను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కళాకారులను, కళలను గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సంస్కృతిక సారధిని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించామ న్నారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్ధ చైర్మన్ మందుల సామ్యేల్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ శ్రీనివాస్, లింగయ్యయాదవ్, సమాచార పౌరసంబధాల శాఖ ఎడి యాస వెంకటేశ్వర్లు, హైదరాబాద్ ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, మనం వికాస వేదిక అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా, వెనె్నల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జిల్లా జానపద జాతర సందర్భంగా కళాకారుల ర్యాలీని ప్రారంభిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి