తెలంగాణ

అంగన్‌వాడీలకు భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: రాష్ట్రంలో త్వరలోనే మూడు వందల అంగన్‌వాడి భవనాలను నిర్మించనున్నట్టు రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని అంగన్‌వాడి కేంద్రాలు అన్నింటికీ సెప్టెంబర్ నుంచి చౌక ధరల దుకాణాల నుంచే రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న స్టాక్ పాయింట్ నుంచి పిల్లలకు అందించే బియ్యం రవాణా అవుతోంది. అలాకాకుండా స్థానికంగానే వాటికి ఇవ్వడం ద్వారా వారికి కావలసినంత రేషన్ లభించడంతో పాటు సమయం ఆదా అవుతుందని మంత్రి చెప్పారు. అంగన్‌వాడి టీచర్ బయోమెట్రిక్ ఆదారంగా వారికి రేషన్ అందిస్తారని, ఆ కేంద్రాల్లో ఉండే పిల్లల సంఖ్య మేరకు రేషన్ అందుతుందని చెప్పారు. అంగన్‌వాడి కేంద్రాల్లో పని చేస్తున్న 60ఏళ్లు నిండిన టీచర్లు, ఆయాలకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద డబ్బులు ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లకు 60వేలు, ఆయాలకు 30వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. వయసు సహకరించడం లేదని కొందరు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కోరడం వల్ల ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్ వాడీ టీచర్లు, ఆయాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ భర్తీ చేయాలని ఆదేశించారు. తెలంగాణ లోని వెనుకబడిన ప్రాంతాల్లో 300 అంగన్ వాడీ మోడల్ భవనాలను నిర్మించనున్నట్టు తెలిపారు. 11రాష్ట్రాల్లో నాలుగువేల భవనాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా తెలంగాణలో మూడు వందల భవనాలను నిర్మించనున్నట్టు చెప్పారు. 704 చదరపు గజాల స్థలంలో వీటిని నిర్మిస్తారు.