తెలంగాణ

రాజీవ్ స్వగృహకు ప్రత్యేక బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించారు.గృహనిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, మున్సిపల్ వ్యవహారాల కార్యదర్శి, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, హౌజింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌లను డైరెక్టర్లుగా నియమించారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్, డైరెక్టర్లు షేర్ హోల్డర్లుగా ఉంటారు. చైర్మన్ ఒక్కరే 4988షేర్లు (ఒక్కో షేర్ విలువ 10రూపాయలు) కలిగి ఉంటారు. మిగతా డైరెక్టర్లు కేవలం రెండేసి షేర్లను మాత్రమే కలిగి ఉంటారు. ఈ మొత్తం ఐదువేల షేర్లు అవుతాయని, వీటి విలువ ఐదులక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇలా ఉండగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు కూడా ఈ కార్పోరేషన్ షేర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది.