తెలంగాణ

రాజకీయ అభద్రతలో కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయ అభద్రతలో ఉన్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన పాలకులకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. సరిగ్గా 17ఏళ్ల క్రితం ఇదే రోజున బషీర్‌బాగ్‌లో విద్యుత్తు ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన అమర వీరులకు సోమవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం ఆయన గాంధీ భవన్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ 17 ఏళ్ళ క్రితం రైతులు, ప్రజలు అప్పటి పాలకుల నిరంకుశ విధానాలపై, విద్యుత్తు ధరల పెంపుపై పోరాటాలు చేశారని, ఇందులో భాగంగా విద్యుత్తు బషీర్‌బాగ్ ఉద్యమం కీలకమైందన్నారు. ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు టిఆర్‌ఎస్ పాలనలోనూ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. ప్రధానంగా వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో ఉందని, రైతులు అనేక రకాల కష్టనష్టాల పాలు అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. పాలకులు ప్రజల వైపు చూడడం లేదని, తమ స్వప్రయోజనాలు, రాజకీయ స్వార్థంతోనే ముందుకు పోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నెలకో బూటకపు సర్వే గురించి చెబుతూ రాజకీయ అభద్రత ఉన్నప్పుడే ఇలాంటి వాటి గురించి ప్రస్తావిస్తుంటారని అన్నారు.